డైలీ రిపోర్ట్ సంగారెడ్డి ,అక్టోబర్ 16
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పట్టణం లో ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్ లను ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. అనంతరం, మోటర్ బైక్ లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
సంగారెడ్డి పట్టణంతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రణ జరిగేలా కోసం ఈ టాస్క్ ఫోర్స్ మోటర్ బైక్ లు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షేట్కర్, టి జి ఐ సి సి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా ఎస్పీ రూపేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 31