డిల్లీ: రిపోర్టర్: ప్రదీప్ కొమ్ముగురి , మే 29;
40 ఏళ్లు ఉన్న ఆమె చిన్న పిల్ల కాదు.. ఆమె అనుమతి లేకుండా చేశాడంటే నమ్మాలా
ఒకే చేతితో చప్పట్లు మోగుతాయా ? ఆమె చిన్న పిల్ల ఏం కాదు కదా ? అతడిపై సెక్షన్ 376 ఎలా నమోదు చేశారు అంటూ బాధిత మహిళ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసిన జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం
ఢిల్లీ నోయిడా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల మహిళను స్వీట్లో మత్తు పదార్థాలు కలిపి లైంగిక దాడి చేసిన విషయంలో, 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పై రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు
దీంతో తొమ్మిది నెలలు జైల్లో గడిపిన యువకుడి బెయిల్ విచారణ జరిపే సమయంలో, పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
తొమ్మిది నెలలు జైల్లో ఉన్నా తనపై ఆరోపణలు ఎందుకు నిరూపించలేదంటూ, ఆమె 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదు అతడితో పలుసార్లు జమ్ముకు కూడా వెళ్లిందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
తనపై పెట్టిన క్రూరమైన సెక్షన్ల పట్ల ఎలాంటి ఆధారాలు లేవని, యువకుడి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు!