తెలంగాణ ప్రతినిది, జూన్ 2(డైలీ రిపోర్ట్);
పలు రంగాల్లో స్ఫూర్తి
దాయకంగా నిలిచే వ్యక్తులు, చిన్నారులకు గ్లోబల్ ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా అవార్డులు
అందజేయనున్నట్టు గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్
డాక్టర్ వీ.సురేష్ కుమార్ తెలిపారు.
భారతీయ సంప్రదాయ కళలు, విద్య, వైద్యం, సమాజసేవ, విధి
నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, నృత్యం, సంగీతం, సాహిత్యం,
క్రీడలు, ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభ చాటిన వారికి
అవార్డులు అందజేస్తారన్నారు. తమ ఆధారాల ప్రతులతో రెండు
పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను జతచేసి జూన్ 9వ తేదీలోగా మా వాట్సాప్ నంబర్ 9347670878 కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9441711359 నెంబరులో సంప్రదిం
చాలన్నారు. ఎంపికైన వారికీ జూన్ 13వ తేదీ 2025 నాడు పురస్కారాలను హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటరియం లో ప్రదానం చేయనునట్టు డాక్టర్ వీ.సురేష్ కుమార్ తెలిపారు.
Post Views: 12