కంది (డైలీ రిపోర్ట్ ) జూన్ 4;
కంది మండలం చిద్రుప్ప గ్రామంలో భూ భారతి2025 గ్రామ రెవెన్యూ సదస్సు లో రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.కంది మండలం చిద్రుప్ప గ్రామంలో భూ భారతి 2025 గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం ద్వారా రైతులకు ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలు అన్ని గ్రామ రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకో వాలని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కంది మండల తహసీల్దార్ రవికుమార్ అన్నారు.చిద్రుప్ప గ్రామ రైతుల భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ కాంగ్రెస్ నేత శ్రీశైలం అన్నారు.ఈకార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు TPCC కార్యదర్శి చేర్యాల ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాంసింగ్ నాయక్, b.ప్రసాద్, మురారి మరియు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు…