హైదరాబాద్, జూన్ 16: ( డైలీ రిపోర్ట్ తెలుగు)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ _చిన్నముదిరాజ్ ( బాలమురళి కృష్ణ) తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు మరియు కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మరియు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ లను ప్రత్యేకంగా కలిశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులను రాష్ట్ర కార్యదర్శి గాను ఎన్నికైనందున్న ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సమావేశం హైదరాబాద్ లోని మంత్రి దామోదర్ రాజనర్సింహ మరియు మహేశ్ కుమార్ గౌడ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణలపై, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యకర్తల శక్తిని పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని నేతలు సూచించినట్లు సమాచారం.
దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, “పార్టీని మరింత బలపరిచేలా ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని ఆశిస్తున్నాం,” అని తెలిపారు. అలాగే శ్రీ మహేష్ గౌడ్, కొత్తగా చేరిన యువతను ఆకర్షించేలా కార్యక్రమాలు తీసుకురావాలనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానంతరం మాట్లాడుతూ, “ఈ ఇద్దరు మంత్రులతో చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి అనేక కార్యాచరణలు చేపడతాం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్. మావిన్ గౌడ్ ( ఓ బి సి జిల్లా చైర్మెన్).రుద్రారం సాయి ,వర్మ , చింటూ విజయ్. శేఖర్ , శ్రీనివాస్ ,సంతోష్ , దేవ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.