పటాన్ చెరువు /సంగారెడ్డి జూన్ 25 : (డైలీ రిపోర్ట్)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శ్రీ బాల మురళి కృష్ణ గారు మంగళవారం గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన బాల మురళి కృష్ణ (చిన్న ముదిరాజ్) పార్టీ అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
రాష్ట్ర స్థాయి పార్టీలో తన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఈ సమావేశం రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంలో నిర్వహించబడింది. ఇందులో పార్టీ బలోపేతం, కార్యకర్తల చైతన్యం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో AICC తెలంగాణ ఇన్-చార్జ్, మీనాక్షి నటరాజన్ , మల్లు భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి)
TPCC అధ్యక్షుడు, మాజీ TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,టీ ఎస్ ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. రాష్ట్ర కమిటీ సమావేశాన్ని సమన్వయించారు
ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా సాయి వర్మ ఎన్ ఏస్ యు ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్), చింటూ విజయ్, రుద్రారం సాయి, సంతోష్, దేవా తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని హృద్యంగా అభినందిస్తూ, పార్టీ నిర్మాణానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.