సంగారెడ్డి బ్యూరో, జూలై 19:
పటాన్ చెరువు నియోజకవర్గం ముత్తంగిలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా, వేడుకగా నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో పాల్గొన్నారు. విద్యార్థినులు బోనాలు ఎత్తి ఊరేగింపు నిర్వహించగా, పోతరాజులు,గంగిరెద్దులు వంటి వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, విద్యార్థులు పాటలు, నృత్యాలు, నాటికలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
స్కూల్ ప్రిన్సిపాల్ సీ.ఎచ్. రాజు మాట్లాడుతూ, “తెలంగాణ సంస్కృతి పిల్లలకు చేరువ చేయడం, వాటి గౌరవం పెంపొందించడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను మరింత వైభవవంతం చేశారు.
Post Views: 2